Carrot fry Recipe
కంటికి ఎంతో మేలు చేసే క్యారెట్ కొబ్బరి కూర (Healthy Carrot Fry)
పరిచయం:
క్యారెట్‌లో విటమిన్-ఏ పుష్కలంగా ఉంటుంది, ఇది కంటి చూపును మెరుగుపరచడానికి ఎంతో సహాయపడుతుంది. తక్కువ నూనె మరియు మసాలాలు లేకుండా చేసే ఈ వేపుడు ఆరోగ్యానికి చాలా మంచిది. అన్నంలోకి లేదా చపాతీలోకి ఇది అద్భుతంగా ఉంటుంది.
కావలసిన పదార్థాలు:
క్యారెట్లు: 3 లేదా 4 (పెద్దవి)
పచ్చిమిర్చి: 2 (నిలువుగా చీల్చినవి)
పోపు గింజలు: 1 స్పూన్ (ఆవాలు, జీలకర్ర, మినపప్పు)
కరివేపాకు: ఒక రెబ్బ
పసుపు: చిటికెడు
ఉప్పు: తగినంత
పచ్చి కొబ్బరి తురుము: 2 స్పూన్లు (ఆప్షనల్ - రుచి కోసం)
తయారీ విధానం:
తయారీ: ముందుగా క్యారెట్లను శుభ్రంగా కడిగి, పైన పొట్టు తీసి చిన్నగా కట్ ముక్కలుగా కట్ చేసుకోవాలి (ముక్కల కంటే తురుము అయితే త్వరగా మగ్గుతుంది మరియు రుచిగా ఉంటుంది).
పోపు: బాణలిలో ఒక స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి మరియు కరివేపాకు వేసి చిటపటలాడించాలి.
వేయించడం: ఇప్పుడు అందులో పచ్చిమిర్చి చీలికలు మరియు క్యారెట్ ముక్కలు వేయాలి. చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి.
మగ్గించడం: మూత పెట్టి సన్నని మంట మీద 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. కలుపుతూ ఉండాలి.
ముగింపు: క్యారెట్ మెత్తబడ్డాక తగినంత ఉప్పు వేయాలి. మీకు ఇష్టమైతే చివరగా పచ్చి కొబ్బరి తురుము కొత్తిమీరను చల్లుకుని ఒక నిమిషం తర్వాత
క్యారెట్‌ను మరీ ఎక్కువగా వేయించకుండా, దోరగా మగ్గిస్తే అందులోని పోషక విలువలు పోకుండా ఉంటాయి. మసాలాలు వాడకపోవడం వల్ల ఇది చిన్న పిల్లలకు కూడా ఎంతో మంచిది.
మరిన్ని రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన వంటల కోసం నా యూట్యూబ్ ఛానల్ దేవి సన్నిధి కిచెన్ ను సందర్శించండి 🔗.





Comments
Post a Comment